Saturday, December 28, 2024

మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

దూరదృష్టితో ఆర్థిక, సామాజిక విధానాలతో దేశాన్ని బలోపేతం చేశారని నటుడు కమల్ హాసన్ ప్రశంసించారు. ఆర్థిక మంత్రి, ప్రధాని మంత్రిగా ఆయన సేవలు ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయన్నారు. ఆయనకు కుటుంబానికి కమల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారత దేశంలో గొప్ప రాజనీతజ్ఞుడు అని, ఉన్నత విద్యావంతులు, మృదు స్వభావి, వినయంగా ఉండే నాయకుడు మన్మోహన్ సింగ్ అని నటుడు చిరంజీవి ప్రశంసించారు. చరిత్రలో నిలిచిపోయే మార్పులు తీసుకొచ్చారన్నారు. అలాంటి గొప్ప సంఘ సంస్కర్త హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా పర్యటక శాఖ సహాయ మంత్రి సేవలందించడం తన అదృష్టమని చిరు పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మన్మోహన్ ఆర్థిక మంత్రి ఎల్‌పిజి సంస్కరణలు చేపడడంతో దేశ గమనాన్నే మార్చేసిందని నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రధానిగా ఉన్నప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా చట్టం తీసుకొచ్చి ఎన్నో సంస్కరణలు చేపట్టారని పవన్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News