Sunday, December 22, 2024

డ్రగ్స్ కేసులో సినీ డైరెక్టర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్‌ను మాదాపూర్ పోలీసులు డ్రగ్స్ కేసులో ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70గ్రాముల కొకైన్, విదేశీ మద్యం బాటిళ్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బస్తీ సినిమా డైరెక్టర్ మంతెన వాసువర్మ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే దాడి చేసిన మాదాపూర్ పోలీసులు జూన్‌లో ఇద్దరిని అరెస్టు చేసింది. అప్పటి నుంచి మిగతావారు పరారీలో ఉన్నారు.

ఇదే కేసులో రాహుల్ అశోక్ టెలోర్, మన్నేరు పృథ్వీ కృష్ణను పోలీసులు జూన్20, 2023లో అరెస్టు చేయగా మిగతా వారు పరారీలో ఉన్నారు. ఈ కేసులో విక్టర్‌ను పోలీసులు ఈ నెల 5వ తేదీన అరెస్టు చేయగా ఇద్దరు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ఏ4గా ఉన్న వాసు వర్మను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. వాసు వర్మపై ఐపిసి 579,698 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News