Monday, December 23, 2024

ఫిలింనగర్ లో ప్రేమోన్మాది దాడి కేసులో నిందితులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు రోజుల క్రితం ఫిలింనగర్ లో జరిగిన హత్య కేసులో దోషులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.  ప్రియురాలు భర్తపై ప్రేమోన్మాది దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యువతికి వివాహం అయినప్పటికీ ఉన్నత చదువులకు లండన్ కు భర్త గౌస్ పంపించాడు. లండన్ లో అద్నాన్ తో కలిసి వివాహిత చదువుకుంది. చదువుకునే సమయంలో ఇద్దరు మధ్య సానిహిత్యం ఏర్పడింది. చదువు పూర్తి అయిన తర్వాత వివాహిత హైదరాబాద్ కు చేరుకుంది.  ఇద్దరు మధ్య ఉన్న సానిహిత్యంతో తీసుకున్న ఫోటోలను చూపెట్టి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డాడు. వివాహిత తన భర్త విడిచి రాలేనని తెగేసి చెప్పడంతో ఆమెను కిడ్నాప్ చేయాలనుకున్నాడు. కిడ్నాప్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లడంతో భర్త అడ్డొచ్చాడు. దీంతో భర్తను అద్నాన్ పొడిచి చంపేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News