Monday, December 23, 2024

మీడియా దిగ్గజం.. సినీ నిర్మాత గంగాధరన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కోజికోడ్ : ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, మీడియా దిగ్గజం, వ్యాపారవేత్త పివి గంగాధరన్ (80) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కేరళలోని కోజికోడ్‌లోని ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. కోజికోడ్‌లోని ఆయన ఇంటి వద్ద ప్రజలకు అంతిమ నివాళులు అర్పించేందుకు గంగాధరన్ భౌతికకాయాన్ని కెటిసి గ్రూప్ కార్యాలయంలో, ఆ తరువాత టౌన్ హాల్‌లో ఉంచుతారు. శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి విశేష సేవలందించిన గంగాధరన్ అస్తమయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సినీ నటులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గంగాధరన్ మలయాళ మీడియా సంస్థ మాతృభూమికి పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. గృహలక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై పలు పాపులర్, అవార్డు విన్నింగ్ చిత్రాలను నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News