Monday, January 20, 2025

ఆగిన షూటింగ్‌లు

- Advertisement -
- Advertisement -

ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం ముట్టడించిన సినీ కార్మికులు, ఉద్రిక్తం
45% వేతనాలు పెంచితేనే షూటింగులకు వస్తాం : ఫెడరేషన్ అధ్యక్షుడు
షూటింగులకు రండి.. రేపు వేతనాలపై నిర్ణయం తీసుకుంటాం : నిర్మాతల మండలి
చర్చించి ఓ నిర్ణయం తీసుకోండి : మంత్రి తలసాని ఆదేశం

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు బుధవారం సమ్మెకు దిగారు. సిని మా షూటింగ్‌లకు హాజరు కాకుండా తీవ్ర నిరసన తెలిపారు. కార్మికుల సమ్మెతో 25 సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని బుధవారం సినీ కార్మికులు ముట్టడించారు. 24 క్రాఫ్ట్‌కు చెందిన వివిధ యూనియన్‌ల కార్మికులు అధిక సంఖ్యలో ఫెడరేషన్ కార్యాలయానికి చేరుకొని తీవ్ర నిరసన తెలిపి ధర్నా చేపట్టారు. నాలుగేళ్ళుగా వేతనాలు పెంచకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు వాపోయారు. ఇంటి అద్దె లు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోవడంతో జీవనం సాగించడం కష్టంగా మారిందని అన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి నానా కష్టాలు పడుతున్నామని చెప్పారు. నిర్మాతలు తక్షణమే ప్రస్తుతం ఉన్న వేతనాలను 30 శాతం పెంచితేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని సినీ కార్మికులు అన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ని నాదాలు చేశారు. కార్మికులు పెద్ద సంఖ్యలో రావడంతో ఫెడరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

45 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్‌లకు : ఫిల్మ్ ఫెడరేషన్

సినీ కార్మికుల వేతనాలను తక్షణమే 45 శాతం పెంచితేనే షూటింగ్‌లకు హాజరవుతామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. 45 శాతం వేతనాలను పెంచే నిర్మాతల సినిమాల షూటింగ్‌లకు మాత్రమే కార్మికులు హాజరవుతారని అన్నారు. వేతనాలు పెంచుతామని నిర్మాతల నుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకున్నాకే షూటింగ్‌లకు వెళ్తామని ఫెడరేషన్ ప్రతినిధులు చెప్పారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ “సినీ కార్మికుల వేతనాల విషయమై నిర్మాతలు హెచ్చరికలు చేసినట్లుగా మాట్లాడారు. వేతనాలను పెంచకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాము. కార్మికుల సమ్మెతో బుధవారం 25 సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో 5 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నిర్మాతలే నష్టపోతారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతలతో చర్చలకు వెళ్తాం”అని అన్నారు.

కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలి : మంత్రి తలసాని

సినీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ మం త్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వా ర్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ “కరో నా నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమాల షూటింగ్స్ లేకపోవడంతో ఉ పాధి దొరకక ఆర్ధిక కష్టాల్లో ఉన్నారు. తక్షణమే కార్మిక సంఘాలతో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొ రవ తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొనే వరకూ ఎదురు చూడవద్దు. స మస్య రెండు, మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయకముందే సామరస్య పూర్వక వాతావరణంలో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కృషి చేయాలి”అని అన్నారు.

పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి..

కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేష్ మా ట్లాడుతూ “గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి బారినపడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకు వెళ్లిపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు తినడానికి తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడు చిత్ర పరిశ్రమ కోలుకుంటోంది. సినిమాలు రిలీజవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు ఒక మంచి పేరొస్తోంది. ఈ పరిస్థితుల్లో నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేదొక్కటే.. కార్మికులకు వేతనాలు ఎంతో కొంత పెంచాలి. అయితే వారం లేదా పదిరోజులు సమయం తీసుకొని ఫెడరేషన్, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి రావడం కష్టం కాదు” అని అన్నారు.

వేతనాలను పెంచాలంటూ తెలుగు సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. కార్మికుల సమ్మె అంశంపై బుధవారం మధ్యాహ్నం సమావేశమైన నిర్మాతల మండలి అనంతరం మీడియా ముందు కు వచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మా త సి. కళ్యాణ్ మాట్లాడుతూ వేతనాలు పెంచడానికి తమకు అభ్యంతరాలు లేవన్నారు. గు రువారం నుంచి యధావిధిగా కార్మికులు అందరూ షూటింగ్‌లకు హాజరు కావాలని సూచించారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ “సినీ కార్మికులు అకస్మాత్తుగా సమ్మెకు దిగడంపై మేమంతా షాకయ్యాం. తరచుగా మేము వేతనాలు పెంచుతూనే ఉన్నాం. అయితే వేతనా లు పెంచాలని కోరుతూ కార్మికులు ఈనెల 6న మాకు ఓ లేఖ రాశారు. అయితే వేతనాలు పెంచడానికి నిర్మాతలు అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మాకు కూడా కొన్ని కండీషన్స్ ఉన్నాయి. ఒక్కసారి అంద రం కలిసి ఈ విషయంపై చర్చించుకుందామ ని వాళ్లకు చెప్పాము. కానీ కార్మికులు అం దరూ అకస్మాత్తుగా సమ్మె చేయడం తప్పు. ప్రస్తుతం నిర్మాతలు అందరూ షూటింగ్‌లు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. గురువారం నుంచి కార్మికులు అందరూ షూటింగ్‌లకు వస్తే వేతనాల పెంపుపై శుక్రవారం చ ర్చించి ఓ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే షూటింగ్‌లు చేయడానికి నిర్మాతలు ఎవరూ సిద్ధంగా లేరు. నిర్మాతలు షూటింగ్‌లు చేస్తేనే కార్మికులకు పని ఉం టుంది. ఇక కార్మికులు సమ్మె నోటీసులు మా కు పంపామని చెబుతున్నారు. ఇందులో ఎ లాంటి నిజం లేదు”అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News