Monday, December 23, 2024

బలగం సినిమా యూనిట్‌కు కెటిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన రెండు సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా ‘బలగం’, ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్దండి, ‘దసరా’ సినిమాలోని నటించిన హీరో నానికి ఉత్తమ నటుడి అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా బలగం సినిమా యూనిట్‌కు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందనలు తలెఇపారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఎంపికకావడంతో ఆయన తన తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దర్శకుడు వేణు, చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా యూనిట్ కష్టపడి పని చేయడంతో ప్రతిఫలం దక్కిందని, భవిష్యత్‌లో మరిన్ని సాధించేందుకు ఇది మొదటి అడుగు అని ప్రసంశించారు. 69వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌-2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News