Monday, December 23, 2024

ఎన్నికలను సినిమా వాళ్లు ప్రభావితం చేయలేరు: కాంగ్రెస్ వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కన్నడ సినీనటుడు కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందని, అయితే ఆరున్నర కోట్ల కన్నడ సోదరసోదరీమణులే ఎన్నికలను ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ ఎంపి కర్ణాటక కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్చి రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఎన్నికలను సినిమా వాళ్లు ప్రభావితం చేయలేరని చెప్పారు. సుర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అక్కడే ఉన్నారు.

మరోనటుడు దర్శన్ బీజేపీకి మద్దతు ?

కర్నాటకలో మరో నటుడు దర్శన్ కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్న సమయంలో కర్ణాటక లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైను కలుసుకున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి బొమ్మై సమక్షంలో నటుడు సుదీప్‌తోపాటు దర్శన్ కూడా బీజేపీ కండువాలు కప్పుకున్నట్టు తెలుస్తోంది. పార్టీస్టార్ క్యాంపైనర్‌గా వ్యవహరిస్తారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గతంలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు కూడా. 2020లో ఆర్‌ఆర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి మునిరత్న కోసం దర్శన్ ప్రచారం సాగించారు. నటుడు అంబరీష్ మరణం తరువాత మాండ్యా లోక్‌స భ స్థానం ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్‌కు మద్దతు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News