Wednesday, January 22, 2025

డ్యూక్ బంతి వద్దు

- Advertisement -
- Advertisement -

టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ‘కుకాబుర్రా’తోనే ఫలితం

దుబాయ్ : మరో పక్షం రోజుల్లో ప్రారంభం కాన్ను వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఐసిసి అంతా సిద్ధం చేస్తుంది. జూన్ 7 నుంచి 11 వరకూ సాగే ఈ ప్రతిష్టాత్మకమైన టెస్టులో భారత్‌ఇంగ్లాండ్ మధ్య అండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరగనుంది. కాగా, ఈ తుది పోరుకు ప్రస్తుతం వినియోగిస్తున్న డ్యూక్స్ బంతికి బదులుగా ఆస్ట్రేలియా కూకబుర్ర బంతిని ఉపయోగించాలని నిర్ణయించారు.

మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ ఐసిసితో జరిగిన సమావేశంలో డ్యూక్ కంటే కూకాబురా బంతి ఎలా మె రుగ్గా ఉంటుందో వివరించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బ్యాటింగ్, భారత్ టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్. భారత స్పిన్నర్లు, ఆస్ట్రేలియా బ్యాటర్ల మధ్య పోరు ఉత్కంఠ రేపనుంది. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలం. స్పిన్నర్లకు కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది. డ్యూక్ అంత ప్రభావవంతంగా లేదు. కాబట్టి కూకాబుర్రా బంతిని వాడాలి” అంటూ పాటింగ్ స్పష్టం చేశాడు.  గతేడాది ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించిన సమయంలో న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్ కూడా డ్యూక్ బంతిపై ఫిర్యాదు చేశాడు.

మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బంతి ఆకారాన్ని కోల్పోతుందని, మృదువుగా మారి స్వింగ్ కోల్పోతుందని విలియమ్సన్ ఫిర్యాదు చేశాడు. కూ కాబుర్రా అంటే… ఒక ఆస్ట్రేలియన్ స్పో ర్టింగ్ గూడ్స్ కంపెనీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో సహా చాలా జట్లు తమ తమ దేశాల్లో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కూకాబుర్రా కంపెనీ బంతిని ఉపయోగిస్తున్నాయి. ఈ బంతి లోపలి రెండు పొరలు చేతితో కు ట్టినవి. ఇంతకుముందు భారత్‌న్యూజిలాండ్ మధ్య జరిగిన డబ్లుటిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో డ్యూక్స్ బంతిని ఉపయోగించారు. దీని రంగు చెర్రీ ఎరుపు. కూకబుర్రా బాల్‌తో పో లిస్తే ఎస్‌జి బాల్‌ను కుట్టడానికి ఉపయోగించే దా రం మందంగా ఉంటుంది. ఎస్‌జి బాల్‌లో కుట్లు మధ్య దూరం తక్కువగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News