జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 5,060 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 39 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు కొనసాగనున్న చివరి దశ పోలింగ్ లో ఓటర్లు 415 మంది అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. ఓటింగ్ సమయంలో భారీగా భద్రతను పెంచారు.
ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఆక్టోబర్ 8వ తేదీ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు బరిలో ఉన్నాయి. 370 రాజ్యాంగ అధికరణం రద్దయిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ కూటమి గెలుపుపై ధీమాగా ఉన్నాయి.