Tuesday, December 24, 2024

అంతర్జాతీయ హంగులతో కోహెడ మార్కెట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కో హెడ మార్కెట్ నిర్మాణానికి తుది ప్రణాళిక సిద్ధ్దమైందని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆయన కోహెడ మార్కెట్ నిర్మాణ ప్రాం తాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ కెసిఆర్ ఆమోదం తర్వాత శంకుస్థాపన పనులు ప్రారంభిస్తామన్నారు. ర్కె ట్‌ను ఆకర్షించేందుకు తగినట్లుగా మార్కెట్‌లో వసతుల ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో నంబర్ వన్ మా ర్కెట్‌గా,ప్రపంచంలో మార్కెట్‌గా ఉండబోతున్నదన్నారు. 199 ఎకరాలలో మార్కెట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మార్కెట్ గోదాంలు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ మేనేజ్ మెంట్, రీ సైక్లింగ్ , సోలార్ సిస్టమ్ , కోల్ స్టోరేజ్ గోదాంలు, రైపెనింగ్ చాంబర్లు, లేబర్, స్టాఫ్ క్వార్టర్లు నిర్మిస్తామని వివరించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులకు అనుగుణంగా సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. మామిడి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా వేపర్ హీట్ ట్రీట్ మెంట్ ఇర్రాడియేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. షెడ్ల నిర్మాణం, కమీషన్ ఏజెంట్ల దుకాణాలు,కోల్ స్టోరేజీలు నిర్మాణం,రహదారుల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు,మాస్టర్ ప్లాన్ ప్రకారం మార్కెట్ స్థలంలో జరగాల్సిన నిర్మాణాలను పరిశీలన చేశారు. ఔటర్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రహదారి ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ కు అత్యంత ప్రాధాన్యం వస్తుందన్నారు. భవిష్యత్ లో ఏటేటా ఉద్యాన పంటల ప్రాధాన్యం పెరగనున్నదని, ప్రపంచ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉద్యాన పంటల విస్తరణ పెరుగుతుందన్నారు. దానికి అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఎగుమతులకు కోహెడ మార్కెట్ కీలకంగా నిలవనున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కోహెడ మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలనలో డైరెక్టర్ లక్ష్మీబాయి ,ఎమ్మెల్యే కిషన్ రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News