- Advertisement -
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికిపైగా ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టుల భర్తీ కోసం గత ఏఢాది ఫిబ్రవరిలో యూపిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపిఎస్‌సి సెప్టెంబర్ 20 నుంచి 29 తేదీ వరకూ మొయిన్స్ నిర్వహించింది. మొయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారిగా పర్సనల్ ఇంటర్వ్యూలు అయ్యాయి. తుది ఫలితాను మంగళవారం విడుదల చేసింది. 1009 మంది ఇందలో ఎంపిక కాగా.. జనరల్ కేటగిరీలో 335, ఇడబ్ల్యూఎస్ 109, ఒబిసి 318, ఎస్సి కేటగిరీలో 160, ఎస్టి కేటగిరలో 87 మంది ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తమ సత్తా చాటారు.
- Advertisement -