Friday, December 27, 2024

లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు ఆమోదం

- Advertisement -
- Advertisement -

Finance bill passed in Lok Sabha

కొత్త ఆర్థిక సంవత్సరానికి రంగం
క్లిష్ట దశలో పన్నులులేని బడ్జెట్
పన్ను చెల్లింపుదార్లు పెరిగారు
తెలియచేసుకున్న ఆర్థికమంత్రి

న్యూఢిల్లీ : లోక్‌సభలో శుక్రవారం ఆర్థిక బిల్లు ఆమోదం పొందింది. దీనితో 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దుల ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. ఇక బడ్జెట్ కేటాయింపుల మేరకు దేశంలో కొత్త పన్నుల విధింపు ఇతర ప్రక్రియలు అమలులోకి వస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన 39 సవరణలను లోక్‌సభ ఆమోదించిన తరువాత ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు తీసుకువచ్చిన సవరణలను మూజువాణి ఓటుతో సభ తోసిపుచ్చింది. ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్ ప్రతిపాదనలను సమర్థించారు. కొవిడ్ దశలతో ప్రపంచదేశాలన్నీ తల్లడిల్లాయి. ఈ క్రమంలో తిరిగి పుంజుకోవడానికి దాదాపు 32 దేశాలలో కొత్త పన్నులు విధించారు. అయితే ప్రపంచంలో ఈ దశలో ఎటువంటి పన్నులకు దిగకుండా బడ్జెట్ తీసుకువచ్చింది కేవలం భారతదేశం అయి ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఉపశమన చర్యలు ఎక్కువగా చేపట్టామని, గరిష్ట ప్రయోజనాల దిశలోనే బడ్జెట్‌ను రూపొందించినట్లు వివరించారు. మూలధన పెట్టుబడుల స్థాయిని పెంచడం వంటి అంశాలను ప్రస్తావించార. తమ ప్రభుత్వానికి పన్నుల తగ్గింపు పట్ల నమ్మకం ఉంది. కార్పొరేట్ టాక్స్‌ల తగ్గింపు క్రమేపీ ఆర్థిక రంగానికి, ప్రభుత్వానికి, కంపెనీలకు మేలు చేకూర్చింది. దీని ఫలితాలు ఇప్పుడు కన్పిస్తున్నాయని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ 7.3 లక్షల కోట్ల మేర కార్పొరేట్ టాక్స్ వసూలు అయిందని మంత్రి వివరించారు. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ దేశంలో 5 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు తదార్లు ఉన్నారు. ఇప్పుడీ సంఖ్య 9 కోట్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. పన్నుల ప్రాతిపదికను బలోపేతం, విస్తృతం చేసే దిశలో తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇచ్చాయి. సంక్లిష్టతలు లేని అసెస్‌మెంట్ విధానం ప్రజలకు చేరింది. వారి ఆదరణను చూరగొందని మంత్రి తెలిపారు. గొడుగులపై కస్టమ్స్ సుంకాల విధింపును మంత్రి సమర్థించారు. ఎంఎస్‌ఎంఇల దేశీయ ఉత్పత్పుల ప్రోత్సాహానికి ఇది దోహదం చేసిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News