Thursday, January 23, 2025

తెలంగాణలో కొలువుల జాతర…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. కొత్తగా మరో 2,391 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఈ ఖాళీ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి), మెడికల్ హెల్త్ బోర్డు (ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌బి), టిఆర్‌ఈఐఆర్‌బి ద్వారా భర్తీ చేయనున్నారు.

బిసి గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పిజిటి 235, టిజిటి 324, లైబ్రేరియన్ 11, డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ 37, లైబ్రేరియన్ (స్కూల్స్) 11, ఫిజికల్ డైరెక్టర్ (డిగ్రీ కాలేజీల్లో) 20, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (స్కూల్స్) 33, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ 33. అసిస్టెంట్ లైబ్రేరియన్ (డిగ్రీ కాలేజీ) 15, ల్యాబ్ అసిస్టెంట్ 60, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 30, స్టోర్ కీపర్ 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.

సమాచార పౌరసంబంధాల శాఖలో 166 పోస్టులు

సమాచార పౌరసంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ 41, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 16, ఎడిటర్ (ఉర్దూ) 01, ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ 22, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 04, పబ్లిసిటి అసిస్టెంట్ 82 పోస్టులు భర్తీ చే యనున్నారు.

స్కూల్ ఎడ్యుకేషన్‌లో 93 పోస్టులు

స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో టిజిటి 87, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ 06 మొత్తం 93 పోస్టులు భర్తీ చేయనున్నారు, బిసి గురుకులాల్లో 63 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషనల్ సొసైటిలోని వివిధ విభగాల్లో 93 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. వీటిలో టిజిటి 87 పోస్టులు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ 6 పోస్టులు భర్తీ కానున్నాయి. బిసి గురుకులాల్లో 417 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 141 జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్4) పోస్టులు ,12 జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్ 3) పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను నేరవేరుస్తోందని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఉద్యోగ ఆశావహులకు భుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News