Monday, December 23, 2024

‘గుజరాత్ కు మూటలు’.. తెలంగాణకు మాటలు

- Advertisement -
- Advertisement -

బిజెపి రాష్ట్రంలోకి వస్తే ఆర్‌టిసినీ వదలదు

రాష్ట్రంలో ప్రభుత్వ రంగ స్థలను అమ్మితే రూ.2వేల కోట్లు, బాయిలకాడ మీటర్లు పెడితే
రూ.25వేల కోట్లు ఇస్తారట

ప్రభుత్వరంగ సంస్థలపై బిజెపి
పాలసీ ఏంటో చెప్పాలి రాష్ట్రంలో
ఉన్న పథకాలు బిజెపి, కాంగ్రెస్
పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు?
15వ ఆర్థిక సంఘం సిఫారసుల
మేరకు తెలంగాణకు రూ.9వేల కోట్లు
ఇవ్వాలి

నర్సాపూర్ బహిరంగ
సభలో బిజెపి, కాంగ్రెస్‌లపై
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏది అమ్ముదమా అని ఎదురు చూస్తున్నదని, రైల్వేలు, రైల్వేస్టేషన్లు, విశాఖ ఉక్కు, పోర్టులు ఇలా అన్ని అమ్ముతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. వాళ్లు అమ్ముడే కాకుండా రాష్ట్రాలకు పోటీ పెడుతున్నారని, మీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సం స్థలను అమ్మితే రూ.2వేల కోట్ల బహుమానం ఇస్తామంటున్నారని దెప్పిపొడిచారు. మాటలు తెలంగాణకు చెప్పి.. మూటలు గుజరాత్‌కు తీసుకుపోతున్నారన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి బుధవారం ఆర్‌టి సి డిపోను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బిజెపి రాష్ట్రంలోకి వస్తే ఆర్‌టిసినీ వదలదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ సంస్థలపై బిజెపి పాలసీ ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. బిజెపి పాలన ఎలా ఉందంటే బావుల కాడ, బాయిల కాడ మీటర్లు పెడితే 25 వేల కోట్ల రూపాయలు ఇస్తారంట, ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే రూ.2 వేల కోట్లు ఇస్తారంట అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం పనిచేయాలి. కానీ, బిజెపి ప్రభుత్వం వ్యాపార పని చే స్తుంది. ఎలా లాభాలు సంపాదించాలని చూస్తోంది. ఆర్టీసీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. బిజెపిని అడుగుతున్న మీ పాలసీ ఏంటి? దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతున్నా రు. రేపు రాష్ట్రంలోకి బిజెపి వస్తే ఆర్‌టిసిని కూడా అమ్ముతారని దెప్పిపొడిచారు.

కర్నాటకలో గంటగంటకు కరెంట్ ట్రిప్

ఆరు గంటల కరెంటే గంటకు గంటకు ట్రిప్ అవుతుదంట కర్నాటకలో తెలంగాణలో భూములు కొని, కర్నాటక బోర్డర్‌కు నీళ్లు పారించుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. డబులు ఇం జన్ అంటారు.. కర్నాటకలోనూ బిజెపి డబుల్ డెక్కర్ ప్రభుత్వం సక్కగా ఉంటేతెలంగాణలోకి పైపులు వేసి కర్నాటకలో ని భూములకు ఎందుకు నీళ్లు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మి, రైతుబంధు లేదన్నారు.

ఏం చేస్తారో కాంగ్రెస్ చెప్పరు

కాంగ్రెస్ వాళ్లు బాగా మాటలు చెబుతున్నారు. ఇస్తే మేం ఏదో చేస్తామంటున్నారు. చేస్తారో చెప్పరు. ప్ర భుత్వంలో ఎరువుల బస్తా కోసం పోలీస్‌స్టేషన్ల ముందు లైన్ కట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. యాసంగిలో పంటలు ఎం డిపోతున్నయి. నీరు వదలమంటే, కాళేశ్వరం గేట్లు ఎత్తి ఒక్క గుంట కూడా ఎండకుండా పంటలు పండేలా నీళ్లు వదలడం జరిగిందన్నారు. కర్నాటకలో రూ.500 పెన్షన్, మన దగ్గర రెండు వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబం ధు లేదు, రైతు బీమా లేదు. సాగు నీళ్లు లేవని విమర్శించారు. వడ్లు కొనడంలేదని సెంటర్లకు వెళ్లి డ్రామాలు చేశారు. ఒకరు పాదయాత్ర అంటే.. మరొకరు మోకాళ్ల యాత్ర అంటూ రోడ్లపైకి వచ్చారు. రూ.300 కోట్లతో వడ్లు కొన్నం. రైతుల అక్కొంట్లలో సొమ్ములు వేశాం.. కర్ణాటక వడ్లు దొడ్డి దారిన తెలంగాణలో రూ.1900కు అమ్ముతున్నారు. బిజెపివాళ్లు జోరుగా మాట్లాడారు. మరి అక్కడి వడ్లు ఇక్కడికి ఎందుకు తెచ్చి అమ్ముతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడు. చత్తీస్‌గడ్‌లో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారా.. రైతు బంధు ఇస్తున్నారా… అక్కడ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఏదంటే అదే ఇస్తామని కాంగ్రెస్, బిజెపిలు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలను మోసం చేద్దామన్న ధోరణితో వారంతా ఉన్నారని విమర్శించారు. మీరు ఇచ్చే వాళ్లు అయితే కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

ఏదైనా గుజరాత్‌కే…

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏదైనా గుజరాత్‌కే ఇస్తున్నారని మంత్రి హరీశ్ విమర్శించారు. మొన్న కేంద్ర కిషన్‌రెడ్డి గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ హైదరాబాద్‌లో పెడతామని ట్విట్లర్లో పెట్టారు. జాగా ఇవ్వమని రాష్ట్రానికి లేఖ రాశారు. నేను వెంటనే జాగా ఇస్తం. పైసలిస్తం. హైదరాబాద్‌లో పెట్టమని లేఖ రాశా. రెండు రోజులు అది గుజరాత్‌లో పెట్టారు. దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని హరీశ్ రావు ప్రశ్నించారు. విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్‌లో పెట్టాలని ఉంది. ఎంపిలు కొట్లాడిండ్రు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తీసుకుపోయారన్నారు. తెలంగాణకు ఏం ఇచ్చిండ్రు అని ప్రశ్నించారు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన 9 వేల కోట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఆర్థిక సంఘం నివేదికను తొక్కిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని నిలదీశారు. తెలంగాణకు రూ.9వేల కోట్లు స్టేట్ స్పేసిఫిక్ గ్రాంట్‌గా, సెక్టార్ స్పేసిఫిక్ గ్రాంట్‌గా ఇవ్వమని చెబితే కేంద్రం ఎగబెట్టిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేయడం తప్ప బిజెపి ఏంచేయడంలేదు. తెలంగాణ ప్రజలకు కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. తెలంగాణ గుండెల నుంచి పుట్టిన పార్టీ టిఆర్‌ఎస్ అన్నారు. కార్యక్రమంలో ఎంపి కొత్తా ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డితోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News