Monday, December 23, 2024

చెన్నై మార్కెట్లో కూర‌గాయ‌లు కొన్న కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

- Advertisement -
- Advertisement -

Nirmala Sitaraman in Market

చెన్నై: తమిళ‌నాడు రాజ‌ధాని చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన బిజెపి సీనియ‌ర్ నేత‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శ‌నివారం ఉద‌యం నుంచి రాత్రి దాకా బిజీగా గడిపారు. త‌న షెడ్యూల్ మేర‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌ను ముగించుకున్న ఆమె రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లోకి వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆరా తీశారు.
అనంత‌రం ఆమె ఓ దుకాణం వ‌ద్ద ఆగి కూర‌గాయ‌లు కొన్నారు. ఓ బుట్ట తీసుకుని కూర‌గాయల‌ను కొనుగోలు చేశారు. కేంద్ర మంత్రి అయి ఉండి కూర‌గాయ‌ల మార్కెట్‌లో ఆగి కూర‌గాయల‌ను కొన్న మంత్రి వీడియోపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లు ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News