ఆర్థిక శాఖ అనుమతి
శాఖల వారీగా జిఒల జారీ
మన హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సిఎం శాసనసభలో ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్ , క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఇతర మంత్రులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు.80 వేల 039 ఉద్యోగాలకు గాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు బుధవారం ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి బుధవారం ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులి స్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, అధికారులు, ఆర్థిక శా ఖ అధికారులతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వనున్నారు. ప్రధానంగా గ్రూప్- 1, హోం శాఖ, జైళ్లు, రవాణాశాఖలు, వైద్య, ఆరోగ్యశాఖలోని పోస్టులతో పాటు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.