ఖాళీల భర్తీపై నేడు అధికారులతో ఆర్థికశాఖ భేటీ
హెచ్‌ఆర్‌డిలో జరిగే సమావేశానికి పూర్తి వివరాలతోరావాలని అన్ని శాఖల అధిపతులకు ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: పలు శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు శాఖల్లో ఏర్పడిన ఖాళీలపై ఆర్థికశాఖ నేడు ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలోని కౌటిల్య హాల్(రెండో అంతస్థులో) సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలతో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆయా శాఖల హెడ్‌లు హాజరుకావాలని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.రామకృష్ణారావు అన్ని శాఖలకు ఈఓ నోట్‌ను జారీచేశారు. మొదటగా పశు సంవర్థక శాఖ, మత్య శాఖ, సివిల్ సప్లయ్ శాఖలకు ఉదయం 10 గంటలకు, ఎన్వీరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇరిగేషన్ అండ్ క్యాడ్, లేబర్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ పరిశ్రమలు, హోంశాఖ, లా డిపార్ట్‌మెంట్ శాఖల అధికారులు 10.30 గంటలకు హాజరు కావాలని రామకృష్ణారావు సూచించారు. వీరితో పాటు లేజిస్లేచర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్భన్ డెవలప్‌మెంట్, యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం కల్చరర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్ విభాగాలకు 11 గంటలకు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌లకు 11.30 గంటలకు, ఇలా పలు విభాగాల అధికారులతో ఆర్థికశాఖ సమావేశం నిర్వహించనుంది.
Finance Ministry meeting with Officials today on vacancies