Monday, December 23, 2024

ఆర్థిక విజయోత్సవాలు

- Advertisement -
- Advertisement -
దశాబ్ది వేడుకలపై నిపుణుల విశ్లేషణ అభివృద్ధికి అద్దం పట్టాయంటూ అభివర్ణన
తొమ్మిదేళ్లలో రూ.18.35లక్షల కోట్ల వ్యయం
ఇందులో అభివృద్ధి, సంక్షేమాలకే రూ.10లక్షల కోట్లు క్యాపిటల్ వ్యయంలో టాప్

మన తెలంగాణ/హైదరాబాద్: సంచలనాత్మకమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విజయవంతంగా అ మలుచేసిన తెలంగాణ ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహించిన దశాబ్ది ఉ త్సవాలు జాతీయస్థాయిలో సరికొత్త చ ర్చకు దారితీశాయి. అభివృద్ధి అంటే తె లంగాణ… సంక్షేమం అంటే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడమంటే తె లంగాణ రాష్ట్రంలోనే కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం సా ధించిన విజయాలపై ఆర్థికవేత్తలు సైతం ఆసక్తికరమైన సమీక్ష చేశారు. రాష్ట్ర ప్ర భుత్వం అట్టహాసంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలను ఆర్ధికవేత్తలు “ఆర్ధిక విజయోత్సవాలు”గా అభివర్ణిస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అ భివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయ విధానాల మూలంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని, కొనుగోలు శక్తి భారీగా పెరిగిందని, ప్ర జల ఆదాయం కూడా దేశంలోని మిగ తా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే రెట్టింపుగా ఉందని, ప్రభుత్వ ఆస్తులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని, ఈ ఉత్సవాలను ఆర్థిక విజయోత్సవాలుగా పరిగణించాలని ఆర్ధికవేత్తలు, ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు సగర్వంగా చెబుతున్నారు. 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23వఆర్థిక సంవత్సరంలోని గత మార్చి నెలాఖరు వరకూ రాష్ట్ర ప్రభుత్వం తొ మ్మిదేళ్లల్లో ఏకంగా 18.35 లక్షల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని, అందులో ఏకంగా 10 లక్షల కోట్ల రూ పాయల నిధులను అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగాలకు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కొందరు ఆర్ధిక నిపుణులు, ఆర్ధికరంగంలోని కొందరు సీనియర్ పాత్రికేయులు లెక్కలు వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలిపారు.

అందుకే తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి తొమ్మిదేళ్ళల్లోనే 13.75 లక్షల కోట్లకు పెరిగిందని, ఇది కాస్తా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరమైన 2023-24 ముగిసే నాటికి (మార్చి 31, 2024) ఏకంగా 14 లక్షల కోట్లకు చేరుతుందని ఆర్ధిక ని పుణులు అంచనా వేశారు. అంతేగాక రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటీ పెరగ డం, వ్యవసాయం, పారిశ్రామికరంగం, ఐటి, ఫార్మా, నిర్మాణ రంగాల్లో రికార్డుస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడం తో రాష్ట్రంలో తలసరి ఆదాయం 3.17 లక్షల రూపాయలకు పెరిగిందని, కేం ద్ర ప్రభుత్వ పరిధిలోని తలసరి ఆదా యం కేవలం 1.40 లక్షల రూపాయలకే పరిమితంగా ఉందని వారు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఎవ్వరూ ఖాళీగా లేరని, ప్రతి ఒక్కరికీ చేతినిండా పని ఉందని, కులవృత్తులపైన ఆధారపడిన ప్రజలు కూడా వారివారి వృత్తుల్లో ఆశించినదాని కంటే మెరుగ్గానే ఆదాయాన్ని సముపార్జించుకొంటున్నారని, అందుకే ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా పెరిగిందని, ప్రజల ఆదాయం పెరగడంతోనే వర్తక, వాణిజ్యరంగాలు కళకళలాడుతున్నాయని, దీంతో పన్నుల ఆదాయం కూడా ప్రభుత్వానికి రికార్డుస్థాయిలో వస్తోందని వారు వివరించారు. అందుకే గడచిన తొమ్మిదేళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సొంత ఆదాయం ఏకంగా 13,55,234 కోట్ల రూపాయలు వచ్చిందని వివరించారు.

ఈ నిధులను అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగం, సేవారంగాలకు ఖర్చు చేశారని, రుణాల రూపంలో సేకరించిన 3.12 లక్షల కోట్ల రూపాయలు, ప్రభుత్వ గ్యారెంటీల రూపంలో వచ్చిన ఒక లక్షా 67 వేల కోట్ల రూపాయల నిధులను అన్నింటినీ క్యాపిటల్ వ్యయం (అభివృద్ధి పథకాలపై చేసిన ఖర్చు) కిందనే ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్ధిక నిపుణులు అభినందిస్తుంటే ఆనందంగా ఉందని ఆ అధికారులు వివరించారు. వ్యవసాయానికి ఉచితంగా 24/7 నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటం, రైతు బంధు, రైతు భీమా పథకాలు, కాళేశ్వరం భారీ లిఫ్టు ప్రాజెక్టు వంటి అనేక ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి తాగునీటి పథకం, దళితబంధు, ఆసరా పెన్షన్లు, చేపలు, గొర్రెల పంపిణీ, బీసీ కులాలకు లక్ష రూపాయలు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, వైద్యరంగంలో చేపట్టిన అభివృద్ధి, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళు… ఇలా అనేక పథకాలు తెలంగాణ ప్రజలకు వరాలుగా మారాయని, ఈ పథకాలు సాధించిన విజయాల నేపథ్యంలో జరిగిన ఉత్సవాలు గనుకనే వీటిని ఆర్ధిక విజయోత్సవాలు అంటే బాగుంటుందని ఆర్ధికవేత్తలు అభివర్ణించారని ఆ అధికారులు వివరించారు.

గ్రౌండ్ రియాలిటీ, ప్రాక్టికాలిటీ (ఆచరణలో)లో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల మూలంగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆస్తులు భారీగా పెరిగాయని ఆర్‌బిఐ కూడా గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రుణాల రూపంలో సేకరించిన నిధులన్నింటినీ నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, రోడ్లు, భవనాలు తదితర అభివృద్ధికరమైన మౌలిక సదుపాయాల కల్పనలకే ఖర్చు చేయడంతోనే రాష్ట్ర జిఎస్‌డిపి కూడా రెట్టింపు అయ్యిందని కూడా ఆర్‌బిఐ గుర్తించిందని ఆ అధికారులు వివరించారు. కానీ దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు లోపభూయిష్టమైన ఆర్ధిక నిర్వహణలను అనుసరిస్తుండటం మూలంగా, పక్కా ప్రణాళికలు లేకపోవడం మూలంగా ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా అప్పులు చేసిన నిధులను ఖర్చు చేస్తున్నారని, అందుకే ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడంలేదని కూడా ఆర్‌బిఐ గుర్తించిందని అంటున్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీలు కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులకు లోబడే ఉన్నాయని కూడా ఆర్‌బిఐ గుర్తించిందని ఆ అధికారులు సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో “అప్పులు తక్కువ, అభివృద్ధి ఎక్కువ” అనే వ్యాఖ్యానాలు జాతీయస్థాయి ఆర్ధికవేత్తలు అంటున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం 21 రోజులపాటు అట్టహాసంగా నిర్వహించిన ఉత్సవాలను ఆర్ధిక విజయోత్సవాలుగా అభివర్ణిస్తున్నామని సగర్వంగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News