Friday, January 24, 2025

పేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

 

హాజీపూర్‌: పాత మంచిర్యాలలోని నిరుపేద కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాస్ కుమార్తె శ్రీనిత హైదరాబాద్‌లోని టీఆర్‌ఆర్ వైద్య కళాశాలలో సీటు సాధించింది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఉన్నత చదువులను ప్రోత్సహిస్తూ గురువారం టీఆర్‌ఎస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు రూ.25వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొలిశెట్టి సునితకిషన్, డీసీసీబీ డైరెక్టర్ ఎర్రం తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, యువజన పట్టణ అధ్యక్షుడు బింగి ప్రవీన్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News