Thursday, January 23, 2025

పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance for the construction of houses for the poor

గరిష్టంగా రూ.3లక్షలు..
త్వరలో విధివిధానాల ఖరారు

అధికారులు రూపొందించిన విధానాల్లో మార్పులు సూచించిన సిఎం కెసిఆర్
లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లదే సామాజిక, ఆర్థిక సర్వేలో ఇళ్లులేని
వారికే చోటు ఎస్‌సి, ఎస్‌టిలకు 50% రిజర్వేషన్

మనతెలంగాణ/హైదరాబాద్ : సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునే నిరుపే దల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ ప థకానికి సంబంధించిన విధి, విధానాలు త్వరలో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. డబుల బెడ్ రూం ఇళ్లు అందని నిరుపేదల కోసం ఈ పథకాన్ని కొత్తగా ప్రభుత్వం ప్రవేశపె డుతున్నట్టు సిఎం కెసిఆర్ గతంలో ప్రకటించడంతో పాటు గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ సుమారుగా రూ. 12వేల కోట్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో దీని కి సంబంధించిన విధి, విధానాలకు హౌసింగ్ అధికా రులు రూపొందించగా ప్రస్తుతం వీటిలో కొన్ని మా ర్పులు, చేర్పులను సిఎం సూచించినట్టుగా తెలుస్తోం ది.

ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను వ చ్చే నెల లేదా దసరాలోగా ప్రకటించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా సమాచారం. అయితే సొంత స్థలం ఉన్న పేదవాళ్లు ఇళ్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్ధిక సాయం అందించే బాధ్యతను వా రిని ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్‌లకు అప్పగించా లని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ పథకం కింద మొత్తం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే అవకా శం ఇవ్వాలని, గరిష్టంగా రూ.3 లక్షల ఆర్థిక సా యం అందించాలని అధికారులు ప్రభుత్వానికి పంపించిన విధానాల్లో సూచించారు. అయితే డబుల్ బెడ్‌రూం తీసుకున్న వారికి కాకుండా గతంలో డబుల్ బెడ్‌రూం కోసం దరఖాస్తు చేసుకున్న (డబుల్ బెడ్‌రూం పథకానికి ఎంపిక కానీ) వారిలో కొందరికీ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్‌లు

ప్రభుత్వానికి సంబంధించిన ఏ గృహ నిర్మాణ పథకంలోనైనా ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. అయితే, ఈ పథకంలో మాత్రం ఒక కొత్త తరహా విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పేదలు, వారి స్థితిగతులను పరిగణలోకి తీసుకొని లబ్థిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఉదాహరణకు…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 శాతానికి పైగా గిరిజనులే నివసిస్తారు. అక్కడ 1 ఆఫ్ 70 చట్టం అమలులో ఉంటుంది. గిరిజనేతరుల చేతుల్లో భూమి ఉండేందుకు ఆస్కారం ఉండదు. ఒక వేళ ఉన్నా, 1960కి పూర్వం ఉన్న వారికే సొంత స్థలం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ గిరిజనేతురులకు వారి జనాభా ఆధారంగా ఇళ్లు ఇవ్వడం కుదరదు. దాంతోపాటు హైదరాబాద్‌లోని పాతబస్తీతో మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా ముస్లిం వర్గానికి చెందిన వారే ఉంటారు. ఇక్కడ ముస్లింమేతర పేదలు సొంత స్థలం కల్గి ఉండేందుకు అవకాశం ఉండదు. రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో దళితులు సొంత స్థలం కలిగి ఉండేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక్కో నియోజకవర్గానికి 3,000 ఇళ్లు నిర్మించాలని ఆశిస్తున్న నేపథ్యంలో ఈ రకమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సూచించినట్టుగా తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందిని జనాభా ప్రాతిపదికన ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

ప్రస్తుతం ప్రభుత్వానికి హౌసింగ్ శాఖ ప్రాథమికంగా నివేదించిన అంశాలు….

సొంత స్థలం కలిగి ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. సామాజిక, ఆర్థిక సర్వే- 2011 ప్రకారం ఇళ్లు లేని వారు అర్హుల పేరు నమోదై ఉండాలి. సొంత స్థలం దాని పూర్వ వివరాలు ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదై ఉండాలి. ఇదివరకు ప్రభుత్వం నుంచి ఏ గృహ నిర్మాణానికి లబ్ధిదారులై ఉండరాదు. గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపికను ప్రకటించి వారి నుంచి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండాలి. సొంత జాగా ఉన్న వారికి ఆన్‌లైన్‌లో స్థలాన్ని ట్యాగ్ చేసే విధంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 75 గజాల వరకు కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 50 గజాల నుంచి 75 గజాల మధ్య ఉండాలి. అయితే కింద ఒక గది, పైన మరో గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలు అయినా సరిపోతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల పైచిలుకు ఇళ్లు ఇవ్వాలని, స్థానిక అవసరాల ఆధారంగా మార్పులు చేర్పులకు కలెక్టర్లు కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. అనధికారికంగా ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్న వ్యక్తులు ఈ పథకం కింద ఇళ్లు పొందేందుకు అనర్హులని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News