Saturday, December 21, 2024

బిసి కులవృత్తులకు లక్ష ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శు భవార్త చెప్పింది, లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది. విశ్వబ్రహ్మణ, నా యీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి వంటి కులవృత్తు లు, చేతివృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి లక్ష ఆర్థిక సాయం అందించాలని గత మంత్రివర్గ స మావేశం లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిం దే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఈ నెల 9న మం చిర్యాలలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామ నిమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అ దే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలచే లబ్దిదారులకు రూ. లక్షను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లోని డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు.

గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి గంగుల కమలాకర్అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సహాయం విధివిదానాలను వేగంగా ఖరారు చేసి దశాబ్ది ఉత్సవాల్లోనే అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఈనెల 6 నుండి 20 వరకూ https:// tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం సహ మొత్తం 38 కాలమ్స్‌తో సరళమైన దరఖాస్తును ఫారంను రూపొందించామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను జిల్లా యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. చేతివృత్తిదారుల జీవితాలలో వెలుగులు నింపి, వారికి ఆర్థిక భరోసాను అందించడం, గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం తపన పడుతుంటారని మంత్రి చెప్పారు.

ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. లబ్ద్దిదారులు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయని, దీని ద్వారా లబ్ధ్దిదారులు ఆర్థిక స్వావలంబన సాధించడంలో అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,బిసి కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయానికి విధి విధానాలు ఖరారు
బిసి కుల వృత్తుల వారికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించే పథకానికి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం విధి విధానాలు ప్రకటించింది. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా రాష్ట్రంలోని బిసి కుల వృత్తుల వారికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి ఇటీవల నిర్ణయించిన విషయం విదితమే. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ. లక్ష సాయం అందించాలని నిర్ణయించింది. దీనికి ఇంకా ఏయే కులాలను పరిగణనలోకి తీసుకోవాలి.. సొమ్మును సాయంగా ఇవ్వాలా, రుణం రూపేణా సబ్సిడీగా ఇవ్వాలా అనే అంశాలపై విధివిధానాలను రూపొందించేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి ఇందులో సభ్యులుగా ఉన్నారు. మంత్రి వర్గ ఉప సంఘం రాష్ట్రంలోని బిసి కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. కుటుంబంలో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో రూ.1.50 లక్షలలోపు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న వారు మాత్రమే అర్హులు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News