Monday, December 23, 2024

సాయిచంద్ కుటుంబ సభ్యులకు కోటిన్నర ఆర్థిక సాయం అందజేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి , డాక్టర్ దాసోజు శ్రవణ్ , కట్టెల శ్రీనివాస్ యాదవ్ కలిసి పార్టీ తరపు నుండి సిఎం కెసిఆర్ ప్రకటించిన కోటిన్నర రూపాయిలలో కోటి రూపా యిల ఆర్థిక సహాయాన్ని రజిని సాయచంద్, కూతురు మినాల్, కొడుకు చరిష్‌కు గుర్రంగూడాలోని వారి నివాసంలో కలిసి అందజేశారు. ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు దివంగత సాయి చంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింతలో దివంగత సాయిచంద్ ఇంటికి వెళ్లి సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ తరపున ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాయి చంద్ తండ్రి వెంకట్రాములకు రూ.25 లక్షలు, సాయిచంద్ సోదరి ఉజ్వలకు రూ.25 లక్షల చెక్కులను అందజేశారు.
సాయిచంద్ మరణం రాష్ట్రానికి తీరని లోటని మంత్రి తెలిపారు. సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో చేరుగ్గా పాల్గొన్నారని, చిన్న వయసు లోనే మృతి చెందడం తెలంగాణ సమాజానికి పూడ్చలేని లోటన్నారు. బిఆర్‌ఎస్  పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మక్తల్ ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.
కుసుమ జగదీష్ కుటుంబానికి1.50 కోట్ల ఆర్థిక సాయం
దివంగత మాజీ జెడ్‌పి చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచింది. సోమవారం జిల్లాలోని మల్లంపల్లిలోని జగదీష్ స్వగృహంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ పంపించిన కోటి 50 లక్షల చెక్కును జగదీష్ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. పిల్లల చదువులతో పాటు వారి కుటుంబానికి పార్టీ తర ఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు కుసుమ జగదీశ్ చిత్రపటానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత పూల మాల వేసి నివాళు లర్పించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి బడేనాగ జ్యోతి, రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, భద్రాచలం బిఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News