Monday, December 23, 2024

బిసి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

మెదక్: తెలంగాణ ప్రభుత్వం బిసి కులవృత్తులు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుందని ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. ఆర్థిక సాయం పొందగోరు లబ్ధ్దిదారులు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలలోపు కలిగి, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు కలిగిన వారు అర్హులని ఆయన తెలిపారు. అయితే ఈ ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా గత ఐదు సంవత్సరాల లోపు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయినా ఆర్థిక లబ్ది పొందిన 2017,18లో 50వేల లబ్దిపొందిన వారు ఈ ఆర్థిక సహాయానికి అనర్హులని ఆయన తెలిపారు.

ఆర్థిక సాయం పొందే కులవృత్తులు, చేతివృత్తుల వారు ఆన్‌లైన్‌లో tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా 20లోపు దరఖా స్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ దరఖాస్తు వెంట కుల, ఆదాయ ధృవీకరణ, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, బ్యాంక్ పాస్‌బుక్‌లతో జతపరిచి సంబంధిత మండల పరిషత్ మున్సిపల్ కార్యాలయంలో 20లోగా సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News