Sunday, December 22, 2024

అర్హులకే రూ.లక్ష ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

మక్తల్ : అర్హులై న బిసి కులవృత్తిదారులకు మాత్ర మే ప్రభుత్వం నుంచి రూ.1లక్ష ఆర్థిక సహాయం అందుతుందని మక్తల్ ఎంపిడీఓ శ్రీధర్ అన్నారు. రూ.లక్ష ఆర్థిక సహా యం కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులు, వృత్తి నైపుణ్యాన్ని పరిశీలించేందుకు ఆయన శుక్రవారం మండలంలోని గుడిగండ్ల, మంథన్‌గోడ్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మక్తల్ మండలంలోని 39గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 567మంది ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో కులవృత్తుల పైనే ఆధార పడి జీవనం కొనసాగిస్తున్న వారిని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే ఆర్థిక సహా యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.కార్యక్రమ ంలో సర్పంచులు మహేశ్వరమ్మ, మహదేవమ్మ, పంచాయతి కా ర్యదర్శులు మల్లేష్, సుమన్‌రెడ్డి, ఎంపిటిసి ఎస్.లక్ష్మీ నర్సిరెడ్డి, ఉప సర్పంచులు వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణయ్యగౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News