Wednesday, January 22, 2025

మేరుబంధు ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రాష్ట్రంలో మేరుకుల వృత్తిదారులకు మేరు బంధ పథకం ప్రకటించి, ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించాలని మేరు సంఘాల ఐక్య వేదిక జేఏసీ చైర్మన్ మునిగాల రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మేరు సంఘాల ఐక్యవేదిక జేఏసి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద శనివారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, మేరు సంఘాల జేఏసీ వ్యవస్థాపకులు వెంకట్రాములు, మునిగాల రమేష్, హైదరాబాద్ ట్విన్ సిటీస్ చైర్మన్ సింగు విష్ణు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపి ఆర్.కృష్ణయ్య, జేఏసీ చైర్మన్ మునిగాల రాము మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక వెనుకబడిన అన్ని కులాలను ఆదుకుంటున్నప్పటికీ, మేరు సామాజికవర్గానికి చెందిన వారిని నిర్లక్షం చేస్తోందని విమర్శించారు. మా మేరు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మేరు కుల వృత్తిదారులకు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా బట్టలు కుట్టే టెండర్స్‌ను మేరు కులవృత్తిదారులకే ఇవ్వాలన్నారు. టైలర్‌షాపులకు ఉచిత విద్యుత్ అందజేయాలన్నారు. మేరు కులానికి చెందిన నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి జిల్లా, పట్టణ కేంద్రాలలో ఐదువేల కుట్టు మిషన్లతో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు బోటిక్, ట్రైనింగ్ ఇప్పించి, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. మేరు కులాన్ని బిసిడి గ్రూపు నుంచి బిసి గ్రూపుఏ లోకి మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు నోముల శాంతి కుమార్, సంతోష్ కుమార్, కీర్తి జయంత్, అరుణ్ కుమార్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News