Monday, January 20, 2025

వరద బాధితులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం: గండ్ర

- Advertisement -
- Advertisement -

మోరాంచపల్లి వరద బాధితులకు 10లక్షల ఆర్థిక సహాయం అందించిన GMRM ట్రస్ట్…

గ్రామ ప్రజలకు సరిపడా వంట గ్యాస్ అందేలా ఆర్థిక చేయూత అందివ్వనున్న గండ్ర శ్రీనివాస్ రెడ్డి

గండ్ర సోదరుల ఆర్థిక సహాయం…..

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజక వర్గంలో అకాల వర్షాలతో భూపాలపల్లి మండలం మొరంచ్చపల్లి గ్రామం నీట మునిగింది. దీంతో ప్రజల నిత్యావసరాల కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా మన ప్రియతమ నాయకులు, భూపాలపల్లి శాసన సభ్యుల గండ్ర వెంకట రమణా రెడ్డి, వారి సోదరులు గండ్ర భూపాల్ రెడ్డి ఆర్థిక సహాయం చేశారు. మరొ పక్క సోదరుడు గండ్ర శ్రీనివాస్ రెడ్డి ప్రతి కుటుంబానికి వంట గ్యాస్ అందిస్తామని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News