Wednesday, January 22, 2025

స్థలం ఉండి ఇల్లు లేని వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

వనపర్తి : స్థలం ఉండి సొంత ఇల్లు లేని వారికి త్వ రలో రూ. 3 లక్షల ఆర్థిక సహకారంతో పేదల సొంతింటి కల పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం విద్యా దినోత్సవ వేడు కల సందర్భంగా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో మన ఊరు మన బడి కింద మండల ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ స్థలం ఉండి సొంత ఇల్లు లేని నిరుపేదలకు వచ్చే నెలలో జిల్లా యంత్రాంగం ద్వారా సర్వే నిర్వహించి ఇల్లు లేని వారి జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. ఇందులో అర్హులైన వారికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయంతో పేదల సొంతింటి కలను సాకారం చేయబోతున్నామన్నారు. అదే విధంగా స్థలం లేని వారిని గుర్తించి ఇళ్ల స్థలాలను సైతం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఇందులో పార్టీలకతీతంగా పూర్తి పారదర్శకంగా ఇళ్ల మంజూరు ఉంటుందని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని తెలిపారు. అదే విధంగా ఊరి ప్రజలు తెలియక ఒక ఫైనాన్స్‌లో డబ్బులు పెట్టి మోసపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే ఎవరి డబ్బులు వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సమావేశంలో జెడి చైర్మన్ ఆర్. లోక్‌నాథ్ రెడ్డి, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News