Wednesday, January 22, 2025

బిసి కుల, చేతివృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : బీసి కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈనెల 9న సంక్షేమ సంబురాల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. బుధవారం సంగారెడ్డి నుండి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొనగా, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బిసి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వీడియో సమావేశం నిర్వహించి బిసి కుల, చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్‌లతో సమీక్ష నిర్వహించారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్షేమ దినోత్సవంన కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి చెక్కుల పంపిణీ, ఇంటి స్థలాలు, గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాలు పటిష్ట కార్యాచరణ చేపట్టి విజయవంతం చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధికా గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారిణి ఆర్. శిరీష, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కృష్ణా నాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News