Friday, November 22, 2024

ఆరె కులస్తులకు ఆర్థిక సహాయాన్ని అందించాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ :– తెలంగాణ ప్రభుత్వం కులవృత్తుల వారికి లక్ష రూపాయాల ఆర్థిక సహాయం పథకాన్ని అమలు చేస్తున్న దానిలో భాగంగానే ఆరెకులస్తులైన పేదలకు అవకాశం కల్పించి, ఆరెలను ఆదుకోవాలని ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మంగళవారం హన్మకొండ బాల సముద్రము శ్రీనివాసనగర్‌లో గల ఆరె సంక్షేమ సంఘం భవనములో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెండా రాజేష్ పాల్గొని మాట్లాడుతూ, వ్యవసాయాన్ని, వ్యవసాయ కూలీని వృత్తిగా స్వీకరించిన ఆరె కులస్తులు వ్యవసాయ దారుల నుండి వ్యవసాయ కూలీలుగా మారి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న పేదలను గుర్తించి బిసి కులవృత్తుల వారికి అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాని కోరారు. దరఖాస్తు చేసుకునే గడవును కూడా మరో వారం రోజులు పొడిగించాలని రాజేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోర్తాల చందర్ రావు మాట్లాడుతూ,ఆరెలను ఓబీసీ లో చేర్పించాలనే డిమాండ్ తో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎస్.దిగంబరావు, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ తో కలిసి డిల్లీకి వెళ్లిన ప్రతినిధి బృందంతో జన అధికార సమితి వారి ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఎన్ సిబిసి కార్యాలయంలో ఎన్సీబీసీ చైర్మన్ గంగారం అహీర్ ను కలిసి ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్పించి ఆరె కులస్తులకు న్యాయం చేయాలనే మెమొరండాన్ని సమర్పించామని, ఆరెలను ఓబీసీ జాబితాలో చేర్పించాలనే చర్చల కోసం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు బిజెపి నాయకులను కలిసి ప్రతినిధి బృందం ఆరె కులస్తుల వెనుకబాటుతనం గురించి చర్చించిన అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆరె కులస్తులతో పాటు మరో రెండు, మూడు కులాల వారిని ఓబీసీ జాబితాలో చేర్పిస్తారని హామీ ఇచ్చారని, తెలంగాణ భవన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆరె సంఘం నాయకులు వివరించారు.

ఈ సందర్భంగా ఎన్సీబీసీ చైర్మన్ గంగారాం అహీర్ కు, ఐఏఎస్ అధికారి నరహరి, కృష్ణమూర్తి లకు ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీల కు ప్రతినిధి బృందం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా అధ్యక్షులు ఇంగ్లే శివాజీ, రాష్ట్ర కార్యదర్శులు గుండెకారి రంగారావు,దుమాల సుధాకర్, పకిడే సాంబారావు, ఆరెకుల విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మోటె చిరంజీవి,జిల్లా నాయకులు కొల్లూరు కండే రావు, పేర్వాల లింగమూర్తి, కౌడగాని మోహన్ రావు, కుడ్ల మనోహర్, దీపక్ జి, నిరంజన్ రావు,హింగే భాస్కర్,హింగే రవి, ఉస్నగిరి శ్రీకాంత్,ఆరే సంక్షేమ సంఘ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గుండెకారి రవికుమార్, ఆరే సంక్షేమ సంఘ దుగ్గొండి మండల అధ్యక్షులు లాండే రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News