Monday, January 20, 2025

15 నుంచి బిసిలకు ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

నల్గొండ : ఈనెల 15వ తేదీ నుంచి బిసిసీలకు ఆర్థి క సహాయం అందజేయాలని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మంత్రి పాల్గొనగా, హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం నుండి బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోని బిసిలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.

బిసి కులవృత్తి, చేతి వృత్తిదారులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాడానికి లబ్ధిదారుల ఎంపిక తొలి విడత జాబితాపై కలెక్టర్లు, బిసి సంక్షేమ అధికారులను జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నందున, వీరి నుంచి 119 నియోజకవర్గాల నుండి ప్రతినెల 50 మందికి చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ, ప్రభుత్వం బిసిలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి ప్రత్యేక దృష్టి సారించినందున జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సమన్వయంతో పని చేయాలన్నారు.

నూతన జిల్లాల ఏర్పాటులో భా గంగా కొన్ని నియోజకవర్గాలు రెండు లేదా మూడు జిల్లాల పరిధిలో ఉన్నందున, ఆయా నియోజకవర్గాల కేంద్రాలు ఏ జిల్లా పరిధిలోకి వస్తాయో ఆ నియోజక వర్గ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో సమన్వ యం చేసుకొని ఆర్థిక సహాయం పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాలో మొత్తం 40810 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇందులో 11267 దరఖాస్తులు నియోజకవర్గాల వారిగా ఆర్థిక సాయం అందజేయుటకు కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా 2348 దరఖాస్తులు ఎంపీడీవోల పరిధిలో పెండింగ్లో ఉన్నట్లు ఆయన వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాజా నిజాం అలీ అఫ్సర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News