Monday, January 20, 2025

గుండెపోటుతో మృతిచెందిన పిసి కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గుండె పోటుతో మృతిచెందిన కానిస్టేబుల్ విశాల్ కుటుంబ సభ్యులకు జాయింట్ పోలీస్ కమిషనర్ గజారావు భూపాల్ ఆర్థిక సాయం అందజేశారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న విశాల్ వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో శుక్రవారం మృతిచెందిన విషయం తెలిసిందే. మోండామార్కెట్, ఆదయ్య నగర్‌లోని కానిస్టేబుల్ విశాల్ ఇంటికి వెళ్లిన జాయింట్ సిపి గజారావు భూపాల్, మహంకాళీ ఎసిపి, మార్కెట్ ఇన్స్‌స్పెక్టర్, ఆసిఫ్‌నగర్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ కలిసి లక్ష రూపాయల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News