Wednesday, December 25, 2024

15 నుంచి బిసి కులవృత్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : జూలై 15 నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్ధిక సహాయం కింద రూ. లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గం గుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి బిసి కులవృత్తులు, చేతి వృత్తులకు ఆర్థిక సహాయం పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్ మాట్లాడుతూ బీసీ కులవృత్తులు, చేతి వృత్తులను సంరక్షించేందుకు సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక చర్యలు తీసుకున్నారని మంత్రి తె లిపారు.

కుల వృత్తులు చేతివృత్తులు చేసుకునే వా రికి ప్రోత్సాహం అందిస్తే ఎదుగుతారనే ఉద్దేశంతో లక్ష రూపాయలు గ్రాంట్ అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారని ఈ పథకాన్ని జూన్ 9వతేదీన సీఎం కేసీఆర్ లాంచనంగా ప్రారంభించారని మ ంత్రి పేర్కొన్నారు. జూన్ 20 వరకు బీసీ కుల వృ త్తులకు ఆర్ధిక సహాయం కోసం 5 లక్షల 28వేల దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో నుంచి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని చేశారు. ప్రతి సెంబ్లీ ని యోజకవర్గానికి 50 మంది లబ్ధిదారులకు మాత్ర మే వర్తిస్తుందని, కొన్ని వర్గాల వారికి మాత్రం వ స్తుందని అసంపూర్తి వార్తలు ప్రచారంలో ఉన్నాయని, ఇవి ఏ మాత్రం వాస్తవం కాదని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

బీసీ కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయంపై జిల్లాకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నివేదిక పంపనున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐడిఓసిలో మాట్లాడుతూ జి ల్లాకు మొత్తం 10959 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 7652 మంది అర్హులు కాగా 522 మంది అనర్హులు అని 2785 దరఖాస్తులు పెండింగ్‌లో ఉ ంచినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్వేతా ప్రియదర్శిని పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ బ్యూరో …
జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ బీసీ కుల వృత్తుల ఆర్ధిక సహయం పథకం కింద జిల్లాలో మొదటి విడతన చెక్కుల పంపిణీకి సిద్దగా ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిర, సహయ బీసీ సంక్షేమ అధికారి విట్టల్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

నాగర్‌కర్నూల్ ప్రతినిధి…
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 20వేల 670 మంది దరఖాస్తులు చేసుకోగా 11004 దరఖాస్తులను లబ్ధిదారులుగా ఎం పిక చేయడం జరిగిందని, 720 దరఖాస్తులు పథకానికి అనర్హులుగా గుర్తించడం జరిగిందని, 894 6 దరఖాస్తులను ఈ నెల 18లోగా వెరిఫికేషన్ పూ ర్తి చేస్తామన్నారు. అర్హులుగా ఎంపికైనా జాబితా నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో 12 00 మంది లబ్ధిదారులను ఈ నెల 15వ తేది నుం చి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్ జి, కల్వకుర్తి ఆర్డిఓ రాజేష్ కుమార్, సెక్షన్ ఇంచార్జి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News