Monday, December 23, 2024

తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to family of fellow constable

హైదరాబాద్ : అనారోగ్యంతో మృతిచెందిన తోటి కానిస్టేబుల్‌కు అతడి బ్యాచ్ కానిస్టేబుళ్లు ఆర్థిక సాయం అందజేశారు. అందరు కలిసి రూ.2లక్షలను మృతుడి భార్యకు అందజేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పరుశురామ్ అనారోగ్యంతో గత మే నెలలో మృతిచెందాడు. పరశురామ్ 2000 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు. అతడితో కలిసి శిక్షణ తీసుకున్న బ్యాచ్‌మేట్లు ఆర్థిక సాయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చేతులమీదుగా ఇప్పించారు. బ్యాచ్‌మేట్‌కు సాయం చేసిన కానిస్టేబుళ్లను రాచకొండ సిపి మహేష్ భగవత్ అభినందించారు. మృతుడి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా అందజేలా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో శ్రీధర్, దుర్గప్రసాద్, నరసింహ, శశికిరణ్, రమాకాంత్ రెడ్డి, శంకర్, దేవేందర్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News