Monday, January 20, 2025

హోంగార్డు కుటుంబానికి ఆర్థికసాయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి: జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన అమలి విశ్వనాథం కుటుంబానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి రూ. 50వేల ఆర్థికసాయంను చెక్కు రూపంలో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దివంగత హోంగార్డు సతీమణి రజితకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పి హోంగార్డు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. దివంగత హోంగార్డు కుటుంబానికి పోలీస్‌శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే శాఖపరంగా రావాల్సిన ప్రయోజనాలన్ని తరగతిలో వచ్చేలా చూస్తామని ఎస్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి, సిసి ఫసిద్దిన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News