Monday, December 23, 2024

మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆర్థిక సాయం అందజేశారు. మేడ్చెల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న జి. శ్రీనివాస్ విధి నిర్వహణలో ఉండగా జనవరి 25వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: ఈనెల 10వ తేదీన బిసి గురుకుల ప్రవేశ పరీక్ష

బాధితుడికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు రూ.11,60,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. శ్రీనివాస్ తల్లికి ఏడాది పాటు నెలకు రూ.2,500 ఇవ్వనున్నట్లు మేడ్చెల్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ బిఎన్‌ఎస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయంట్ సిపి నారాయణనాయక్, డిసిపి సందీప్, మేడ్చెల్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాస్‌రావు, ఎడిసిపి ట్రాఫిక్ శ్రీనివాస్ రెడ్డి, ఎసిపి వెంకట్‌రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News