Sunday, December 22, 2024

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇటీవల విధినిర్వహణలో మృతిచెందిన హోంగార్డు కుంటుంబానికి సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఆర్థిక సాయం అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చెల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బి.మారుతి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. గత ఏడాది నవంబర్ 07న పిఎస్ పరిధిలోని రావోల్‌కోల్ కమాన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. అటువైపుగా వస్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ హోంగార్డును ఢీకొట్టాడు.

దీంతో తీవ్రంగా గాపడిన మారుతిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. హోంగార్డు శాలరీ బ్యాంక్ ఖాతా హెడ్‌డిఎఫ్‌సిలో ఉండడంతో పర్సనల్ డెత్ యాక్సిండెంట్ కవరేజీ కింద వచ్చిన రూ.30,00,000లక్షల చెక్కును హోంగార్డు భార్య, ఇద్దరు కుమారులకు సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అందించారు. కార్యక్రమంలో ఎడిసిపి రవిచందన్‌రెడ్డి, ఎడిసిపి షమీర్, ఎసిపి కృష్ణ, హెడ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రతినిధులు సత్యనారాయణ, శర్మిష్ట, శ్రేయసోని, రాజేష్ టాంగు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News