Sunday, December 22, 2024

లారీ ప్రమాదంలో ధ్వంసమైన ఇంటి యజమానులకు ఆర్థిక సహాయం…

- Advertisement -
- Advertisement -

లారీ ప్రమాదంలో ధ్వంసమైన ఇంటి యజమానులకు ఆర్థిక సహాయం అందించిన మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

మనతెలంగాణ/వికారాబాద్ న్యూస్: లారీ ప్రమాదంలో ధ్వంసమైన ఇంటి యజమానులకు మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నష్ట పరిహారం కింద తమకు తోచిన విధంగా రెండు కుటుంబాల వారికి 15,000 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం మాజీమంత్రి ప్రసాద్ కుమార్ వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో లారీ ప్రమాదంలో నష్టపోయిన వారిని కలిసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం మాట్లాడారు. లారీ ప్రమాదంలో నష్టపోయిన నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ సత్యనారాయణ, కిషన్ నాయక్, హాజీ, ఆనంద్, శ్రీనివాస్ ముదిరాజ్, రజినీకాంత్, విజయ్ కుమార్, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News