మనతెలంగాణ/ హైదరాబాద్: తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందిపడిన బొడిగె నరసయ్య కుటుంబానికి కల్లుగీత కార్పొరేషన్ ఆర్థిక సహాయం అందజేసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు బొడిగె నరసయ్య గాయపడగా అతడి కుటుంబానికి రూ.15 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బిసి వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు అధికారులు అందజేశారు.
బొడిగె నరసయ్య వైద్య ఖర్చులకు తక్షణ ఆర్థిక సాయం కొరకు కల్లు గీత కార్పొరేషన్ అధికారి పాముకుంట్ల రవీందర్‌గౌడ్, జనగామ జిల్లా బిసి అభివృద్ధి అధికారి రవీందర్ చెక్కును శనివారం అందజేశారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్నే వెంకటమల్లయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కమ్మగాని రమేష్, నాగన్న, జిల్లా కమిటీ బండి కొండయ్య, మండల అధ్యక్షులు మూల మహేష్, కమ్మగాని వెంకటేశ్, సొసైటీ అధ్యక్షులు బొడిగె యాదగిరి, గూడ యాదగిరి, మూల వెంకన్న తాళ్లపల్లి, సోమ నారాయణ, సమ్మయ్య, గుండెబోయిన శ్రీకాంత్, ఎలకత్తుల శంకరయ్య పాల్గొన్నారు.
స్పందించిన మంత్రులకు ధన్యవాదాలు..
గీత కార్మికుడి ప్రమాదం తెలిసిన వెంటనే స్పందించిన మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్పొరేషన్ చైర్మన్,బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కార్పొరేషన్ ఎండి. ఉదయ్‌ప్రకాష్‌కు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, జనగామ జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలియజేశారు.