Saturday, November 2, 2024

గీత కార్మికుడికి ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to Palm tree worker

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడిన కల్లు గీత కార్మికుడు నర్మెట శ్యామ్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.15 వేల చెక్కును టాడి కార్పొరేషన్ అందజేసింది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన గీతకార్మికుడు నర్మెట శ్యామ్ తాటి చెట్టు పై నుంచి కిందపడ్డాడు. వరంగల్‌లో చికిత్స పొందుతున్న అతడిని ఆదివారం కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ పాముకుంట్ల రవీందర్‌గౌడ్, జనగామ జిల్లా బిసి అభివృద్ధి శాఖ జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కలిశారు. ఈ మేరకు రూ.15 వేల చెక్కును కార్పొరేషన్ తరపున అందజేశారు. వీరితో పాటు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్ర ఉప్పలయ్య, బాల్నే వెంకటమల్లయ్య, గౌరవ అధ్యక్షులు తాళ్లపెళ్లి బొందయ్య, మండల అధ్యక్షులు గానగాని రమేష్ ,మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్య, గడ్డం శ్రీనివాస్, నర్మెట శ్రీకాంత్, అనూష ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బాధిత కుటుంబాలకు సాయం అందజేత

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలకు తక్షణ సాయం రూ.25 వేలు, ప్రమాదవశాత్తు గాయపడిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని కార్పొరేషన్ విడుదల చేసింది.ఈ మేరకు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు, కార్పొరేషన్ చైర్మన్, బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు, కార్పొరేషన్ ఎండి ఉదయ్‌ప్రకాష్‌లకు రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం, జనగామ జిల్లా కమిటీలు కృతజ్ఞతలు తెలియజేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News