Saturday, December 21, 2024

పిసి కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆర్థిక సాయం అందజేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం కానిస్టేబుల్ భార్యకు రూ.8లక్షల చెక్కు అందజేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ శేఖర్ బ్రేయిన్ స్ట్రోక్ రావడంతో మృతిచెందాడు.

అతడి కుటుంబానికి భద్రత నుంచి రావాల్సిన ఆర్థిక సాయాన్ని పిసి భార్య హైమావతికి అందజేశారు. కానిస్టేబుల్ పిల్లల యోగక్షేమాలను సిపి అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చిన వెంటనే సంప్రదించాలని సిపి వారికి చెప్పారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే బిపి, షుగర్‌ను చెక్‌చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి ఇందిర, పోలీసు అధికారు సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News