Monday, January 20, 2025

పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to police families

 

మనతెలంగాణ, హైదరాబాద్ : వివిధ కారణాలతో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆర్థిక సాయం అందజేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో చెక్కులను అందజేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న జయేందర్, ఎఆర్‌ఎఎస్సై, ఎఆర్ పిసిలు అంజయ్య అనారోగ్యంతో మృతిచెందారు, శేఖర్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. జయేందర్ కానిస్టేబుల్ భార్యకు రూ.2లక్షల చెక్కు, అంజయ్య భార్యకు ముగ్గురు పిల్లలపై ఫిక్సెడ్ డిపాజిట్ రూ.66,666 ఒకరిపై, శేఖర్ భార్యకు రూ.5లక్షల చెక్కును అందజేశారు. కానిస్టేబుల్ అంజయ్య ముగ్గురు కుమార్తెల చదువు కోసం పాఠశాల ఫీజులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెల్లిస్తున్నారు. కార్యక్రమంలో అడిసిపి అడ్మిన్ శ్రీనివాస్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News