సిటిబ్యూరోః అనారోగ్యంతో మృతిచెందిన పోలీసులకు కుటుంబాలకు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. కీసర పోలీస్ ష్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు భద్రత నుంచి వచ్చిన రూ.6,80,951ల చెక్కు, నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అశోక్ కుటుంబ సభ్యులకు రూ.7,39,100 చెక్కు అందజేశారు.
మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వినోద్‌కుమార్ కుటుంబ సభ్యులకు భద్రత నుంచి వచ్చిన రూ.7,92,440 చెక్కు అందజేశారు. మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు పింఛన్, ఉద్యోగం త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపి డిఎస్ చౌహాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.