Friday, December 20, 2024

ఎస్‌ఐ కుటుంబానికి పోలీసు సిబ్బంది ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తూ ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురై గత జూన్ 8వ తేదీన మరణించిన బొక్క ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు. మేడ్చల్ డిసిపి సందీప్ ఆధ్వర్యంలో మేడ్చల్ జోన్ పోలీస్ సిబ్బంది కలిసి తమ వంతు సాయంగా రూ. 10 లక్షల జమ చేసి ఆ చెక్కును బుధవారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర చేతులమీదుగా ప్రభాకర్ రెడ్డి లక్ష్మీప్రసన్న, తల్లి రమాదేవి, తండ్రి సాగర్ రెడ్డి కి అందజేశారు.

2014 బ్యాచ్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తించిన ఆయన అకాల మరణం పట్ల సిబ్బంది సంతాపం తెలిపారు. గతంలో దారూర్, యాలాల్, తాండూర్, కొడంగల్ పోలీస్ స్టేషన్లలోను ప్రభాకర్ రెడ్డి ఎంతో సమర్థవంతంగా తన విధులను నిర్వించారని గుర్తు చేసుకున్నారు. పోలీస్ శాఖ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా వచ్చేలా చూస్తామని ఈ సందర్భగా సిపి స్టీఫెన్ రవీంద్ర ఎస్‌ఐ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ సందీప్, మేడ్చల్ ఏసిపి వెంకట్ రెడ్డి, దుండిగల్ సిఐ రామకృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News