Friday, December 20, 2024

నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

బూర్గంపాడు : మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున సోoపల్లి గ్రామానికి చెందిన నడిపింటి రమేష్, సంధ్య దంపతుల చిన్న కుమార్తె ధరణి (11)కు రూ.14,000 ఆర్ధిక సహాయం అందించారు. ఈ పాప పుట్టిన ఒక సంవత్సరం తరువాత అనారోగ్యంగా ఉన్నందున హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లగా వైద్యులు వైద్య పరీక్షలు చేసి తలసేమియా వ్యాధితో బాధపడుతుందని, అలాగే కడుపులో బల్ల ఉందని చెప్పగా అప్పటి నుంచి ఈ రోజు వరకు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రతి నెల నెలకు రెండు సార్లు రక్తం ఎక్కిస్తున్నామని, లేకపోతే పాప బతకదని వైద్యులు తెలిపారు. వయస్సు పెరిగిన తర్వాత ఆపరేషన్ చేసి బల్ల తొలగించొచ్చని వైద్యులు తెలిపారు.

ఇప్పుడు పాపకు 11 సంవత్సరాలు రావడంతో భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు సూచన మేరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్ళారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఈ నెల 30న ఆపరేషన్ చేస్తామని, ఆపరేషన్‌కు సుమారుగా రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. నిరుపేద కుటుంబమైన దంపతులు రమేష్, సంధ్య కూలీ పని చేసి వచ్చే సంపాదనతో వారి పెద్ద కుమార్తెను చదివిస్తూ, తన చిన్న కుమార్తెకు వైద్యం చేయించడానికి వారి సంపాదన సరిపోక కొంత అప్పులు చేసి మరి వైద్యం చేయిస్తున్నారు.

కానీ ఆపరేషన్ చేయడానికి కావలసిన 2 లక్షలు లేక పోవడంతో దాతలు సహాయం చేసి తన కుమార్తె కు ప్రాణ బిక్ష పెట్టగలరని వేడుకుంటున్నారు. వారి కుటుంబ దయనీయ పరిస్థితిని చూసి నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందిచారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండా రెడ్డి మాట్లాడుతూ నడిపింటి రమేష్, సంధ్య దంపతులకు ధరణి కూతురిగా పుట్టడం నిజంగా ధరణి చేసుకున్న అదృష్టమని వారు కూలీ పని చేసి వచ్చే చాలీచాలని సంపాదనతో 11 సంవత్సరాలుగా ధరణికి ఎలాంటి లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ అలాగే వారు పడే కష్టం వారి ఇద్దరూ పిల్లలు పడకూడదని ఇంత కష్టాల్లో కూడా వారి పెద్ద కూతురు తరణిని ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు.

ఎంత కష్టమైన కానీ ఇంకాపై చదువులు కూడా చదివిస్తామని చెపుతున్నా వారి మనో దైర్యానికి మెచ్చుకుంటూ వారికి అండగా ఉం టామని అలాగే ధరణి ఆపరేషన్‌కు దాతలు సహా యం చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో కోశాధికారి కైపు రాజేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఆవుల శివనాగిరెడ్డి, సభ్యులు బత్తుల రామ కొం డా రెడ్డి (సొసైటీ డైరెక్టర్), పేరం రామిరెడ్డి, సంకా సురేష్, డి.బాల నారాయణ రెడ్డి, బిజ్జం వెంకట రామిరెడ్డి, ఎం.వెంకట నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News