Saturday, December 21, 2024

సైబరాబాద్‌లో ఆర్థిక నేరాల్లో వృద్ధి

- Advertisement -
- Advertisement -

2020లో 436, 2021లో 606 కేసులు నమోదు
పేదలే బాధితులు, తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలని అత్యాశతోనే మోసపోతున్నారు
అత్యాశను సొమ్ము చేసుకుంటున్న నేరస్థులు

Financial crime growth in Cyberabad

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఆర్థిక నేరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో ఇలాంటి నేరాలు చాలా తక్కువగా జరిగేవి, కానీ ఈ మధ్య కాలంలో ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని ఆర్థిక నేరాలు డబ్బులు తీసుకుని నిండాముంచుతున్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్, అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు డిపాజిట్ చేసి మోసపోతున్నారు. 2020లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 436 కేసులు నమోదు కాగా, 2021లో 606 కేసులు నమోదయ్యాయి. ఏడాదిలో 176 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి, వాటిలో వివిధ రకాల కేసులు ఉన్నాయి. ప్రజల అత్యాశను పెట్టుబడిగా పెట్టుకుని నిందితులు వివిధ స్కీములతో వందలాది కోట్ల రూపాయలను దోచుకున్నారు. వేలాది మంది బాధితులు వీరికి లక్షలాది రూపాయలు కట్టి మోసపోయారు.

మల్టీలెవల్ మార్కెటింగ్‌లో వందలాది మంది బాధితులు డబ్బులు పెట్టి నిండాముగినారు. ఛీటర్లను నమ్మి డబ్బులు పొగొట్టుకున్న తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షేర్ బైక్, ఇండస్ వీవా మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం, యూనియన్ బ్యాంక్ గ్యారంటీ మోసం, కార్వే, బిహెచ్‌ఈఎల్ ఎంప్లాయి అసోసియేషన్, నకిలీ డాక్యుమెంట్ల కేసులు నమోదయ్యాయి. షేరింగ్ బైక్ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12,000మంది బాధితులు ఉండగా, నిందితులు రూ.50 కోట్లు ముంచగా పోలీసులు రూ.3కోట్ల రికవరీ చేశారు. ఈ కేసులో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

ఇండస్ వీవా కంపెనీ మల్టీలెవల్ మార్కెటింగ్ కేసులో 24మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు 9.5లక్షల మంది నుంచి రూ. 1,500 కోట్లు వసూలు చేసిన నిందితుల నుంచి రూ.20కోట్లు వసూలు చేశారు. యూనియన్ బ్యాంక్ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఎనిమిది కంపెనీలు 53 కోట్ల రూపాయలు మునిగాయి. కార్వీ ఫైనాన్షియల్ సర్వీస్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా 5,200మంది బాధితులు ఉన్నారు. వారికి సంబంధించిన రూ.2,640 కోట్లను సంస్థ డైరెక్టర్లు వారికి తెలియకుండానే షేర్లను విక్రయించి డబ్బులను సొంతానికి వాడుకున్నారు. బిహెచ్‌ఈఎల్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లో జరిగిన మోసంలో 13మంది నిందితులను అరెస్టు చేయగా బాధితులు 313మంది ఉన్నారు, రూ.18 కోట్లను ముంచారు. నకిలీ డాక్యుమెంట్లతో లావాదేవీలు నిర్వహించిన రెండు కేసుల్లో బాధితులను రూ.11.5 కోట్లు ముంచారు.

డబ్బులు తిరిగి రావు…

చాలా కేసుల్లో పేద వాళ్లే ఎక్కువగా బాధితులుగా ఉన్నారు, తమ డబ్బులు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని చెప్పడంతో డబ్బులు కట్టి మోసపోతున్నారు. ఇలా మల్టీలెవల్ మార్కెటింగ్‌లో చాలామంది బాధితులు డబ్బులు డిపాజిట్ చేయడమే కాకుండా తమకు తెలిసిన వారిని కూడా చేర్పించడంతో నిండామునిగారు. వారు మునగడంతోపాటు తమ బంధువులు, స్నేహితులను ఎంఎల్‌ఎం స్కీముల్లో చేర్పించడంతో చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. ఇలాంటి స్కీముల్లో డబ్బులు పెడితే తిరిగి రావని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా వినడంలేదు. మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంల్లో డబ్బులు పెట్టడమే కాకుండా మరి కొంత మందిని చేర్పించడం కూడా నేరం. ఈ విషయం చాలామందికి తెలియదు, కానీ నిర్వాహకులు చెప్పే మాటలు నమ్మి నిండామునుగుతున్నారు. చాలా కేసుల్లో పోలీసులు బాధితులను అరెస్టు చేయకుండా సానుభూతితో విడిచిపెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News