ఆరు గ్రాఫ్‌లతో రాహుల్ స్పందన
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇప్పుడు పొరుగు దేశం శ్రీలంకను పోలి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం భారత్, శ్రీలంక ఆర్థిక వ్యవస్థల గ్రాఫ్‌లను విడుదల చేశారు. నిరుద్యోగం, ఇంధన ధరలు వీటితో పాటు మత ఘర్షణలలో ఇరుదేశాల మధ్య సారూప్యత ఉందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రజలను వాస్తవాలనుంచి దూరం తీసుకువెళ్లే యత్నాలకు దిగుతోంది. అయితే నిజాలు దాచితే దాగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. దిగువన ఉన్న లంక లాగానే ఇక్కడా పరిస్థితి దిగజారిందన్నారు. ఆరు గ్రాఫ్‌లను ఆయన వేర్వేరుగా ఇరుదేశాలకు సంబంధించి జతపర్చారు.
2017 నుంచి రెండు దేశాలలో నిరుద్యోగం పెరుగుతూ వచ్చి 2020 నాటికి ఎక్కువ స్థాయికి చేరిందిం. కరోనా వైరస్‌కు లాక్‌డౌన్ల ఏడాది నుంచి ఈ పరిణామం చోటుచేసుకుందన్నారు. తరువాతి దశలో కొంత తగ్గుముఖం పట్టిందన్నారు. ఇక ఇంధన ధరల విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇండియా శ్రీలంకలలో 2017 నుంచి గత ఏడాది తరువాత మధ్యలో కొంత విరామం తిరిగి ఇప్పుడు పెరుగుదలలు కొట్టొచ్చేలా ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా ఇరుదేశాలలో మతపరమైన హింసాకాండల ఘటనలు ఉధృతం అయ్యాయని తెలిపే గ్రాఫ్‌ను కూడా ఆయన పొందుపర్చారు.
ధరలతో జనం బాధలబందీ : ప్రియాంక
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజలు చివరికి తమ దైనందిన గమనానికి కూడా దొరికిన చోటల్లా అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఎన్నో గొప్పలు చెప్పే బిజెపి కేంద్ర సర్కారు మధ్య తరగతి, పేద వర్గాల ఆదాయం పెంచేందుకు ఒక్క విధానం కూడా తీసుకురాలేదని అన్నారు. పైగా అన్ని పాలసీలు బడుగు వర్గాలకు కంటకప్రాయం అయ్యాయని అన్నారు.
Distracting people won’t change the facts. India looks a lot like Sri Lanka. pic.twitter.com/q1dptUyZvM
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2022