Friday, December 20, 2024

డిసెంబర్ ఆఖరు నాటికి ఈ పనులు పూర్తి చేయండి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిసెంబర్‌లోకి అడుగుపెట్టాం, అయితే ఈ నెలలో కొన్ని పనులకు గడువు తేదీ ఉంది. వాటిని ఈ నెలాఖరు లోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఈ పనులను వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని పూర్తి చేసుకోండి. మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్‌లో నామినీని జోడించడం, ఎస్‌బిఐ అమృత్ కలాష్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ, బ్యాంక్ లాకర్ ఒప్పందం చివరి తేదీ వంటివి ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకోండి, లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఉచిత ఆధార్ అప్‌డేట్
గత 10 ఏళ్లలో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయకుంటే, డిసెంబర్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశం ఉంది.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) ఈ అవకాశం కల్పిస్తోంది. ఆధార్ మోసాలను నిరోధించడానికి 10 సంవత్సరాలు దాటిన ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ వివరాలను అప్‌డేట్ చేయాల్సిందిగా యుఐడిఎఐ కోరుతోంది.

బ్యాంక్ లాకర్ ఒప్పందం గడువు
సవరించిన బ్యాంక్ లాకర్ ఒప్పందం క్రమబద్ధమైన పరిష్కారం కోసం ఆర్‌బిఐ డిసెంబర్ 31 చివరి తేదీని నిర్ణయించింది. మీరు అంతకు ముందు అప్‌డేట్ చేసిన బ్యాంక్ లాకర్ ఒప్పందాన్ని సమర్పించారా? అయితే మీరు అప్‌డేట్ చేయబడిన లాకర్ ఒప్పందానికి మరోసారి సంతకం చేసి సమర్పించాల్సి రావచ్చు.

ఎస్‌బిఐ హోమ్‌లోన్
ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గృహ రుణాలపై 65 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) లేదా 0.65 శాతం వరకు తగ్గింపును అందించే ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ ఆఫర్‌లు రెగ్యులర్ హోమ్ లోన్, ఫ్లెక్సీపే, ఎన్‌ఆర్‌ఐ, ప్రివిలేజ్‌తో పాటు నాన్- సాలరీపై వర్తిస్తాయి. ఎస్‌బిఐ హోమ్ లోన్ వడ్డీ రేటుపై ప్రత్యేక తగ్గింపునకు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది.

డీమ్యాట్ నామినీకి చివరి తేదీ
ఇప్పటికే ఉన్న డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్లకు నామినీ పేర్ల నమోదుకు గడువును డిసెంబర్ 31 ఇచ్చారు. సెబీ సర్క్యులర్ ప్రకారం, డీమ్యాట్ ఖాతాకు సంబంధించి ‘నామినీ ఎంపిక’ సమర్పించడానికి చివరి తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగించారు.

వినియోగించని యుపిఐ ఐడిల మూసివేత
గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే, పలు బ్యాంకుల పేమెంట్ యాప్‌లను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు వినియోగించకుంటే మూసివేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) నిర్ణయించింది. యాక్టివ్‌గా యుపిఐ, యుపిఐ ఐడిలు, నంబర్‌లను బ్లాక్ చేయాలని ఎన్‌పిసిఐ కోరింది. ఎన్‌పిసిఐ ఈ సర్క్యులర్ బ్యాంకులు, పేమెంట్ సంస్థలు అన్నింటికి నవంబర్ 7న జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు (టిపిఎపి), పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (పిఎస్‌పి) ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 నాటికి దీన్ని అమలు చేయడం తప్పనిసరి.

ఎస్‌బిఐ అమృత్ కలష్ స్పెషల్ ఎఫ్‌డి
దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన అమృత్ కలష్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) పథకం గడువును పొడిగించింది. 7.10 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రయోజనాన్ని ఇప్పుడు డిసెంబర్ 31 వరకు పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News