మధిర : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీనవోలు నుండి గత ఏడాది మార్చిలో జరిగిన 10 వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆ పాఠశాలకు చెందిన 1984-85 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు 15000 రూపాయిలు నగదును బహుమతిగా అందించారు. సోమవారం ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయిని షేక్ సాబిరా బేగం అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ నగదు బహుమతిని అందజేసినారు.
9.7 జిపిఏ సాధించి ఏర్రుపాలెం మండల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ స్థానములో నిలిచిన మారుతీ ఉదయశ్రీ కు 10000 రూపాయల నగదు మరియు పాఠ శాల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన రేళ్ళచర్ల నేషిక శ్రీలక్ష్మి కు 5000 రూపాయల నగదును పూర్వ విద్యార్థులు అంద జేసినారు. 1984-85 బ్యాచ్ తరఫున గురిజాల శ్రీనివాస రావు, జగన్నాధం యాగయ్య, నండ్రు ప్రకాశ్ జగన్నాథం భిక్షం హాజరై ఈ నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్నమ్మ, జి.శ్రీనివాస్, భూషణ్ రాజు, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లీ-దండ్రులు విధ్యార్ధులను అభినందించారు.