Monday, November 25, 2024

పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భద్రత

- Advertisement -
- Advertisement -

Financial security for police families

అనారోగ్యంతో మరణించిన పోలీసులు
చెక్కులు అందించిన సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, హైదరాబాద్ : అనారోగ్యంతో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆర్థిక సాయం అందజేశారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో చెక్కులను అందజేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ బి.పరుశరామ్, అంబర్‌పేట్ ఆర్మ్‌డ్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసిన చిన్నా, ఇబ్రహీంపట్నం పిఎస్‌లో పనిచేసి మరణించిన ఎఎస్సై లక్ష్మిపతి కుటుంబ సభ్యులకు రాచకొండ భద్రత నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. మరణించిన పోలీసుల కుటుంబాలకు వెంటనే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మినిస్టీరియల్ సిబ్బందిని ఆదేశించారు. కుటుంబంలోని వారికి ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి నర్మద, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు భద్రరెడ్డి, కృష్ణారెడ్డి తదితరలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News