Monday, December 23, 2024

మృతి చెందిన పోలీసు కుటుంబానికి ఆర్థిక భద్రత

- Advertisement -
- Advertisement -

గద్వాల: అనారోగ్యంతో మరణించిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ కె. సృజన భద్రత ఎక్స్‌గ్రేషియ కింద రూ. 3,96,630ల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. జిల్లా కేంద్రంలో సాయుధ దళ కార్యాలయంలో ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న పి. యాదయ్య గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్‌తో మరణించగా వారి కూతురు శ్రీదేవికు భద్రత ఎక్స్‌గ్రేషియ కింద 3,96,630ల చెక్‌ను జిల్లా ఎస్పీ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారి కుటుంబ స్థితి గతులను, వారి కూతురు విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏఓని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏఓ సతీష్, సాయుధ దళ డిఎస్పీ ఇమ్మనియోల్ , ఆర్‌ఐ నాగేష్ , యాదయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News